ప్రెగ్నెంట్ భార్య పొట్ట కోసిన భర్తకు జీవితఖైదు
ఉత్తర్‌ప్రధేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఎనిమిది నెలల కడుపుతో ఉన్న భార్యకు పుట్టబోయే బిడ్డ జెండర్ తెలుసుకునేందుకు పొట్ట కోశాడు.
ఉత్తర్‌ప్రధేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఎనిమిది నెలల కడుపుతో ఉన్న భార్యకు పుట్టబోయే బిడ్డ జెండర్ తెలుసుకునేందుకు పొట్ట కోశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడగా.. లోపలున్న మగబిడ్డ ప్రాణాలు కోల్పోయింది.
వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రధేశ్‌లోని బదౌన్‌కు చెందిన పన్నాలాల్, అనిత దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు. ఆమె మళ్లీ గర్భవతి కావడంతో ఈసారి మగబిడ్డను కనివ్వాలని అనితతో అతడు గొడవ పడ్డాడు. లోపల ఎవరున్నారో చూస్తానంటూ ఆమె పొట్ట కోశాడు. దీంతో స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. ఆమె ప్రాణాలతో బయటపడింది. అయితే, లోపలున్న మగబిడ్డ మృతిచెందింది. కాగా, ఈ ఘటనలో బదౌన్ కోర్టు ఐపీసీ 307, 313 సెక్షన్‌ల కింద పన్నాలాల్‌కు జీవితఖైదు విధించింది.