గుజరాత్‌లో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టివేత
గుజరాత్‌లో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాదులను కేంద్ర నిఘా సంస్థ అరెస్ట్ చేసింది.
గుజరాత్‌లో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాదులను కేంద్ర నిఘా సంస్థ అరెస్ట్ చేసింది. ఆ నలుగురు ఉగ్రవాదులు శ్రీలంకకు చెందిన వారిగా గుర్తించారు.
అయితే, ముందుగా విమానాశ్రయంలో ఉన్నారని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కు సమాచారం అందడంతో విమానాశ్రయానికి చేరుకుని ముమ్మరంగా తనిఖీలు నిర్వహించగా.. నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ గుర్తించి అదులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, విచారణలో వారు శ్రీలంకకు చెందినవారిగా గుర్తించారు. అయితే, వారు చెన్నై నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌లోని తమ భాగస్వాముల నుంచి సమాచారం కోసం వారు ఎదురుచూస్తున్నట్లు విచారణలో తేలింది. వారి ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ప్రస్తుతం రహస్య ప్రదేశంలో దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు.