BREAKING: రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెంగళూరు పోలీసుల నోటీసులు..!

BREAKING: రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెంగళూరు పోలీసుల నోటీసులు..!

టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 27వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 27వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో విచారించాలని పోలీసులు నిర్ణయించారు. మరోవైపు రేవ్ పార్టీ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నా కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకడంతో సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్స్ రాకెట్ కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రేవ్ పార్టీలో డ్రగ్స్, గంజాయి పట్టుబడటంతో పార్టీలో పాల్గొన్నవారి బ్లడ్‌ శాంపిల్స్‌ను పోలీసులు సేకరించారు. 

Read More పాకిస్తాన్‌కు ర‌క్త‌క‌న్నీరు

దాదాపు 103 మంది వద్ద నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించగా.. వారిలో 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలగా వారి 59 మంది పురుషులు, 27మంది యువతులు, మహిళలు ఉన్నారు. అందులో నటి హేమ ఉండటం గమనార్హం. తాను రేవ్ పార్టీలో లేనని బుకాయిస్తూ తొలుత హేమ ఓ వీడియోను విడుదల చేయగా బెంగళూరు పోలీసులు ఆమె ఫొటోను విడుదల చేసి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Related Posts