భార్య ప్రైవేట్ ఫొటోలతో భర్త బ్లాక్‌మెయిల్.. ఫిలింనగర్‌లో కేసు
- ఫేస్‌బుక్‌లో ప్రైవేట్ ఫొటోలు పోస్టు చేశాడంటూ ఫిర్యాదు
Husband Blackmail: హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో బెదిరిస్తూ వేధిస్తున్నాడనే ఆరోపణలపై భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. బసవతారకంనగర్‌కు చెందిన 24 ఏళ్ల టీచర్ తన భర్త నిరంతరం వేధిస్తూ, తన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది. 2022లోనే తన ప్రైవేట్ ఫొటోలను దుర్వినియోగం చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడని, అంతేకాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త నుంచి నిరంతరం వేధింపులు ఎదురవుతున్నాయని, ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.