ఎవరికీ తలవంచని మేరు పర్వతం రామోజీరావు
ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతితో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతితో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘ ఎవరికీ తలవంచని మేరు పర్వతం.. దివి కేగింది.. ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశారు.
అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఓ ట్వీట్ చేశాడు. ‘రామోజీ రావు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత భారతీయ సినిమా దిగ్గజమైన ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఆయన మన మధ్య ఇక లేరనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అంటూ పేర్కొన్నాడు.
ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం ..
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2024
దివి కేగింది 🙏💔
🙏 ఓం శాంతి 🙏 pic.twitter.com/a8H8t9Tzvf
శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం.
— Jr NTR (@tarak9999) June 8, 2024
‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం… pic.twitter.com/ly5qy3nVUm



