అమలాపురంలో పవన్ కళ్యాణ్‌కు వినూత్న బర్త్‌డే విషెస్

అమలాపురంలో పవన్ కళ్యాణ్‌కు వినూత్న బర్త్‌డే విషెస్

  • రంగురంగుల ముగ్గులతో పవన్‌కు బర్త్‌డే విషెస్.. అమలాపురంలో సందడి

Pawan Kalyan Birthday: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ మహిళలు తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. సాధారణ ముగ్గులకు భిన్నంగా పవన్ సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేసి బర్త్‌డే విషెస్ తెలిపారు.

ఈ ముగ్గుల్లో పవన్ కళ్యాణ్ నటించిన పలు సినిమాల పేర్లను ప్రత్యేకంగా అలంకరించారు. ‘బద్రి’, ‘జల్సా’, ‘పంజా’, ‘తొలిప్రేమ’తో పాటు తాజాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఓజీ’ పేర్లను కూడా ముగ్గుల్లో పొందుపరిచారు. వివిధ రంగులతో ఆకర్షణీయంగా వేసిన ఈ ముగ్గులు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పవన్‌పై తమకున్న అభిమానాన్ని ఇలా సృజనాత్మకంగా వ్యక్తం చేయడం ఆనందంగా ఉందని మహిళలు తెలిపారు.

Read More గణనాథుడి చెంత మూషికం: సీలేరులో అరుదైన దృశ్యం

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు తమకు సాధారణ రోజు కాదని, పెద్ద పండుగలా భావిస్తామని మహిళలు పేర్కొన్నారు. ఆయన సినిమాలు, వ్యక్తిత్వం తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని, అందుకే ప్రతి ఏడాది పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఇళ్ల ముందు వేసిన పవన్ సినిమాల పేర్లతో కూడిన రంగురంగుల ముగ్గులు స్థానికంగా సందడి వాతావరణాన్ని తీసుకొచ్చాయి.

Related Posts