9 ఏళ్లకే కోటీశ్వరుడు అయిన దేవాన్ష్.. ఎలా అంటే..?

9 ఏళ్లకే కోటీశ్వరుడు అయిన దేవాన్ష్.. ఎలా అంటే..?

 

ఎప్పుడైనా ఎన్నికల ఫలితాలు వచ్చాయో అప్పటి నుంచే చంద్రబాబు కుటుంబ స్థాయి అమాంతం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూటమి భారీ మెజార్టీ సాధించింది. ఇటు ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు అటు కేంద్రంలో కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. పైగా చంద్రబాబు నాయుడు వల్లే ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందనే టాక్ నడుస్తోంది.

Read More  రెండో రోజు దావోస్‌లో సీఎం చంద్రబాబు

దాంతో చంద్రబాబుకు సంబంధించిన షేర్లు అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా షేర్లు పెరగాయి. ఇక ఆయనకు సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు అమాంతం డబుల్ అయిపోయాయి. 12 శాతం గ్రేడింగ్ పెరగడంతో ఆస్తులు డబుల్ అయిపోతున్నాయి. 

ఇక తొమ్మిదేళ్ల దేవాన్ష్ కూడా కోటీశ్వరుడు అయిపోయాడు. ఎలా అంటే ఆయన పేరు మీద 56,075 షేర్లు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలకు ముందు రోజు, అంటే 2024 జూన్ 3న ఈ షేర్ల విలువ రూ.2.4 కోట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు వాటి విలువ దాదాపు రూ.4.1 కోట్లకు పెరిగింది. అంటే హెరిటేజ్ షేర్స్ పెరగడం దేవాన్ష్‌ ఆస్తులను పెంచేసిందన్నమాట. 

 హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ ప్రైస్‌ పెరగడంతో నాయుడు కుటుంబ సంపద రూ.1225 కోట్లు పెరిగింది.

Related Posts