అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం
- ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి
- సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకు సభలోకి..
- ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన ఛాంబర్‌కు వెళ్లిపోయిన జగన్
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మంత్రుల ప్రమాణం తరువాత ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
అసెంబ్లీ ప్రారంభం అయిన ఐదు నిమిషాల వరకు జగన్ సభలోకి రాలేదు. తన ప్రమాణ స్వీకార సమయంలోనే సభలోకి అడుగుపెట్టారు. జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్తూ శాసనసభలో సభ్యులకు నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగారు. అనంతరం ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి జగన్ మోహన్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం సభ్యులతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ సభలో కూర్చోకుండా ఆయన ఛాంబర్‌కు వెళ్లారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి...
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2024
ప్రమాణస్వీకారం అనంతరం అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్ pic.twitter.com/9dwiu8pWKq