పేరు మార్పు విషయంలో ముద్రగడకు షాక్

పేరు మార్పు విషయంలో ముద్రగడకు షాక్

ముద్రగడ పద్మనాభరెడ్డిగా తన పేరును మార్చుకుంటున్నట్లు వెల్లడించారు. తాజాగా ఒక షాక్ ముద్రగడకు తగిలినట్లు కనిపిస్తోంది. అనపర్తి మండలంలో మాజీ సర్పంచ్ కర్రీ వెంకట రామారెడ్డి కోస్తా ఆంధ్ర రెడ్డి సంఘం సభ్యులను విజ్ఞప్తిని చేస్తూ ఓ లేఖ రాశారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం ఈసారి హాట్ టాపిక్‌గా మారింది. అక్కడి నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తానని సవాల్ చేసిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానన్నారు. ఎన్నికల ఫలితాల్లో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకుంటున్నానని ఇటీవల ప్రకటించారు.

ముద్రగడ పద్మనాభరెడ్డిగా తన పేరును మార్చుకుంటున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించి కొన్ని రకాల పేపర్లను చూపిస్తూ పేరు మార్చుకునే పనిలో ఉన్నానని చెప్పారు. మరికొద్ది రోజుల్లో పేరు మార్పు పూర్తవుతుందని తెలిపారు. అయితే, తాజాగా ఒక షాక్ ముద్రగడకు తగిలినట్లు కనిపిస్తోంది. అనపర్తి మండలంలో మాజీ సర్పంచ్ కర్రీ వెంకట రామారెడ్డి కోస్తా ఆంధ్ర రెడ్డి సంఘం సభ్యులను విజ్ఞప్తిని చేస్తూ ఓ లేఖ రాశారు.

నైతిక విలువలు లేకుండా మాట్లాడిన వ్యక్తులు రెడ్లలో చేరాలనుకుంటే వారిని చేర్చుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ముఖ్యంగా ఆయన జన్మించిన కులానికి అప్పకీర్తి తెచ్చి తమ రెడ్డి కులంలో కలవడానికి ఆయనకు ఎవరు అనుమతిచ్చారని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం తమ రెడ్డి కులంలో చేరొద్దంటూ మాజీ సర్పంచ్ కర్రీ వెంకటరామిరెడ్డి కోరారు. అదేవిధంగా మరో మాటగా.. ఎవరైనా చేరడానికి అనుమతి ఇచ్చి ఉంటే చేరవచ్చు అంటూ కూడా రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన లేఖ ప్రసుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Posts