యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన బీఆర్ఎస్ అగ్రనేతలు

  • సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి.
  • సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ భరోసా.. అండగా ఉంటామని హామీ.

Telangana Politics: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు కలిసి ఆస్పత్రికి వెళ్లి వైద్యులను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు అందిస్తున్న చికిత్సపై ఆరా తీసిన నేతలు, పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన వారు, ఈ క్లిష్ట సమయంలో పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రార్థిస్తున్నారని పేర్కొన్న బీఆర్ఎస్ నేతలు, ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు తిరిగి రావాలని ఆకాంక్షించారు.

Read More ‘తెలంగాణ రైజింగ్-2047’లో కార్పొరేట్ భాగస్వామ్యం కావాలి

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/top-leaders-of-brs-visited-peddi-sudarshan-reddy-at-yashoda/article-20232