జిమ్‌ నుంచి బయటకు వస్తుండగా హర్యాన్వీ సింగర్‌ అంకిత్‌ బలియాన్‌ హత్య

జిమ్‌ నుంచి బయటకు వస్తుండగా హర్యాన్వీ సింగర్‌ అంకిత్‌ బలియాన్‌ హత్య

  • ఉత్తరప్రదేశ్‌లో హర్యాన్వీ సింగర్‌పై కాల్పులు.. అంకిత్‌ బలియాన్‌ మృతి

Haryanvi Singer Ankit Baliyan Murder: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో హర్యాన్వీ సింగర్‌, యూట్యూబర్‌ అంకిత్‌ బలియాన్‌ దారుణ హత్యకు గురయ్యారు. జిమ్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు ఆయనపై పలుమార్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అంకిత్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.

కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Read More బట్టలు చించి, కర్రలతో దాడి.. యూపీలో పోలీసులపై కన్వరియాల ఆగ్రహం

మరోవైపు సోనిపట్‌కు చెందిన గోగి గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు చెబుతున్న భోలు షాపురియా అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో అంకిత్‌ బలియాన్‌ హత్యకు తామే బాధ్యులమంటూ పోస్ట్‌ చేసినట్లు సమాచారం. అంకిత్‌ తమ ప్రత్యర్థి వర్గానికి మద్దతుగా ఉన్నారని, తమ గ్యాంగ్‌ నాయకుడిపై జరిగిన దాడికి సంబంధించిన పాటను రూపొందించారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గ్యాంగ్‌ ప్రకటనను పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.

అంకిత్‌ బలియాన్‌ హత్యకు అసలు కారణం ఏమిటి, కాల్పులు జరిపిన వ్యక్తులు ఎవరు, ఈ ఘటన వెనుక గ్యాంగ్‌ వివాదం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం కొనసాగుతోంది.

Related Posts