జులైలో రైతు భరోసా డబ్బులు: మంత్రి తుమ్మల
On
వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసే రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసే రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జులైలో ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని అన్నారు. అయితే, రైతుల నుంచి అఫిడవిట్ తీసుకున్న కౌలుదార్లకు మాత్రమే రైతు భరోసా సాయం అందుతుందని పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి తమ పార్టీ కట్టుబడి ఉందని వెల్లడించారు.