సీఎం రేవంత్ పర్యటన వేళ మేడారంలో ఆంక్షలు.. మహిళల ఆవేదన
- మేడారానికి వచ్చి వెళ్లగొడుతున్నారు.. ప్రభుత్వ తీరుపై మహిళల ప్రశ్నలు
Medaram Jatara: ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు విధించిన ఆంక్షలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను లోపలికి అనుమతించకుండా, కనీసం బయట కూడా నిలబడేందుకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళలు ఆరోపించారు. టైలరింగ్ నేర్చుకుంటున్న తమను మేడారానికి రావాలని చెప్పడంతో సుమారు 100 మంది మహిళలు ఇక్కడికి వచ్చామని, తీరా వచ్చిన తర్వాత వెళ్లిపోవాలని పోలీసులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా దూరం నుంచి తమను పిలిపించి ఇప్పుడు బయటకు పంపించడంపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, కార్యక్రమానికి హాజరయ్యేందుకే వచ్చామని తెలిపారు. వచ్చిన తర్వాత కనీసం అక్కడ ఉండేందుకు కూడా అనుమతించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. “మాకు తినడానికి తిండి లేక వచ్చామా?” అంటూ ప్రభుత్వ తీరుపై ప్రశ్నించారు.
సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా కారణాలతో పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ, తమలాంటి మహిళలను ముందుగా పిలిపించి అనంతరం వెళ్లగొట్టడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని అధికారులు అర్థం చేసుకుని తగిన విధంగా స్పందించాలని మహిళలు కోరారు. సీఎం పర్యటన సందర్భంగా మేడారంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.