వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే

  • దోమలపెంట నుంచి శ్రీశైలం వరకు ట్రాఫిక్ కష్టాలు.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు

Srisailam Traffic: శ్రీశైలానికి భక్తులు భారీగా తరలిరావడంతో శ్రీశైలం రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దోమలపెంట (బ్రహ్మగిరి) నుంచి లింగాలగట్టు వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. లింగాలగట్టు నుంచి శ్రీశైలం ఎంట్రెన్స్ వరకు కూడా వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. మొత్తం దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు సమాచారం.

వీకెండ్ కావడంతో.. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కార్లు, ఇతర వాహనాల్లో తరలిరావడంతో రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబాలతో కలిసి వచ్చిన భక్తులు వాహనాల్లోనే ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read More రహదారి లేదు.. వంతెన లేదు.. వాగు దాటి బడికి విద్యార్థులు

రహదారిపై వాహనాలు కదలకపోవడంతో శ్రీశైలం వెళ్లే భక్తులతో పాటు తిరుగు ప్రయాణంలో ఉన్న వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు రంగంలోకి దిగి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. కీలక ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించి వాహనాలను క్రమపద్ధతిలో ముందుకు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు.

వీకెండ్ నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం మార్గంలో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

🕒 15 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/as-it-was-a-weekend-the-devotees-who-flocked-to/article-21685

Tags:  

Advertisement

LatestNews

అర్చకుడు కాదు.. కీచకుడు! గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి
డెలివరీ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు.. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు
వీకెండ్ కావడంతో శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే
పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం
దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ కాంతుల్లో బుర్జ్ ఖలీఫా
చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
అర్ధరాత్రి దిగొచ్చిన సీఐ.. బహిరంగ క్షమాపణతో ముగిసిన న్యాయవాదుల వివాదం