రష్యాలో వైల్డ్‌బెర్రీస్‌ భారీ లాజిస్టిక్స్‌ హబ్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి

  • వైల్డ్‌బెర్రీస్‌ హబ్‌పై ఉక్రెయిన్‌ దాడి..

Ukraine news: రష్యాలోని ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ వైల్డ్‌బెర్రీస్‌కు చెందిన భారీ లాజిస్టిక్స్‌ హబ్‌పై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి జరిగినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. మాస్కో సమీపంలోని కోలెడినో ప్రాంతంలోని భారీ గోదాముపై దాడి జరగడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఉక్రెయిన్‌కు చెందిన ఫైర్‌ పాయింట్‌ సంస్థ ఈ దాడిలో తమ FP-1 డ్రోన్లు ఉపయోగించినట్లు ప్రకటించింది. ఈ లాజిస్టిక్స్‌ కేంద్రం సుమారు 2.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న వైల్డ్‌బెర్రీస్‌ ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా పేర్కొంటున్నారు.

ఈ కేంద్రం వస్తువుల నిల్వ, సార్టింగ్‌, పంపిణీకి కీలకంగా ఉండటంతో దాడి ప్రభావం వైల్డ్‌బెర్రీస్‌ సరఫరా వ్యవస్థపై పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఉక్రెయిన్‌ వరుసగా వైల్డ్‌బెర్రీస్‌ లాజిస్టిక్స్‌ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటుండగా, సంస్థకు చెందిన పలు కీలక గోదాములు ఇప్పటికే దెబ్బతిన్నట్లు సమాచారం. ఉక్రెయిన్‌ రక్షణ వర్గాలు తాజాగా వైల్డ్‌బెర్రీస్‌కు చెందిన టాప్‌ 10 లాజిస్టిక్స్‌ కేంద్రాల్లో ఏడింటి కార్యకలాపాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నాయి.

Read More హోర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ అమెరికాదే.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

తాజా దాడితో ఏర్పడిన నష్టంపై 1.5 బిలియన్‌ డాలర్లకు పైగా అంచనాలు వినిపిస్తున్నప్పటికీ, ఈ మొత్తం స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. అంతకుముందు వైల్డ్‌బెర్రీస్‌ గోదాములపై జరిగిన వరుస దాడుల వల్ల సంస్థ, విక్రేతలకు కలిపి బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది.

మరోవైపు రష్యా అధికారులు ఉక్రెయిన్‌ భారీ డ్రోన్‌ దాడి నిర్వహించిందని, మాస్కో ప్రాంతంలో పలు ప్రాంతాలు ప్రభావితమయ్యాయని తెలిపారు. తాజా దాడుల్లో వైల్డ్‌బెర్రీస్‌ గోదాం వద్ద అగ్నిప్రమాదం సంభవించడంతో పాటు ప్రాణనష్టం కూడా నమోదైనట్లు నివేదించింది.

🕒 16 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/international/ukraine-drone-attack-on-wildberrys-massive-logistics-hub-in-russia/article-21721

Tags: