లక్ష మంది తో సంగారెడ్డి లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

  • సంగారెడ్డి సీఎం బహిరంగ సభ ఏర్పాట్లపై  సెక్రటేరియట్ లో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, టీపిసిసి  వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమీక్ష
  • సమీక్ష సమావేశం లో పాల్గొన్న సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, సెట్విన్ చైర్మెన్ గిరిధర్ రెడ్డి

విశ్వంభర,హైదరాబాద్ : ఈనెల 15న సంగారెడ్డిలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లపై సచివాలయంలోని తన ఛాంబర్‌లో నీటిపారుదల, పౌర సరఫరా శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, మంత్రి దామోదర రాజనర్సింహ వైరల్ ఫీవర్‌తో బాధపడుతుండటం వల్ల ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు.ఈ సందర్భంగా సభకు భారీ జన సమీకరణ, వేదిక ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డికి చేరుకుంటారని, సాయంత్రం 4 గంటల వరకు సంగారెడ్డి లో  ఉంటారని నేతలు వెల్లడించారు. 

సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని, జన సమీకరణ, భద్రత, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్, జగ్గారెడ్డి అధికారులకు సూచించారు.ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల నుండి నియోజకవర్గానికి ఒకరు చొప్పున, మొత్తం పది మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికపైనే స్వయంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తారని మంత్రి తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌కు సూచించారు. సుమారు లక్ష మంది జనంతో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి స్పష్టం చేశారు.WhatsApp Image 2026-08-11 at 6.43.19 PM

Read More పంజాగుట్టలో ఖననం చేసిన శిశువు మృతదేహం మాయం.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు

🕒 11 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/cm-revanth-reddys-public-meeting-in-sangareddy-with-lakhs-of/article-21633