మహాత్మా జ్యోతిబా ఫూలే – సావిత్రిబాయి ఫూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం. -తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
విశ్వంభర, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే గార్ల సామాజిక సంస్కరణలు, విద్యా విప్లవం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలు సమాజానికి చిరస్మరణీయమని తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ అన్నారు.మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే గార్లను స్మరించుకుంటూ (HMDA గ్రౌండ్స్ ఖైరతాబాద్ లో) నిర్వహించిన విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తో పాటు గా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి,రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, వి హనుమంతరావు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివిధ కుల సంఘాల చైర్మన్లు పాల్గొన్న సందర్భంగా తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ....ఫూలే దంపతులు సమాజంలోని అణగారిన వర్గాలకు విద్యను అందించేందుకు, మహిళల విద్యాభివృద్ధికి, సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయమని ఆయన పేర్కొన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం బీసీలతో పాటు అన్ని వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.“విద్య, ఉపాధి, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికీ అందాలన్నదే మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే గార్ల లక్ష్యం. ఆ మహనీయుల ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీసీల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి” అని గూడూరు శ్రీనివాస్ అన్నారు.బీసీ వర్గాలకు మరిన్ని అవకాశాలు కల్పించడం, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడటం, విద్యా మరియు ఉపాధి రంగాల్లో ప్రోత్సాహం అందించడం ద్వారా సమాజంలో సమానత్వాన్ని సాధించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా ఫూలే దంపతుల సామాజిక న్యాయ స్ఫూర్తిని మరోసారి ప్రజల్లోకి తీసుకురావలసిన బాధ్యత మన అందరి పైన ఉందని గుర్తు చేశారు