అనంతపురం కరువుపై సీపీఐ పోరుబాట.. ఆగస్టు 17న కలెక్టరేట్ ముట్టడి
- రైతు సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ముట్టడి.. సీపీఐ పిలుపు
Anantapur news: అనంతపురం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని, రైతులు బ్యాంకుల్లో తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి. నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 17న అనంతపురం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార యాత్రను ప్రారంభించిన పి. నారాయణస్వామి, మండలంలోని ప్రధాన వీధుల్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాలు లేకపోవడంతో రైతులు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టినా పంటలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు ట్యాంకర్లు, బిందెల ద్వారా నీటిని అందిస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కడం లేదన్నారు.
కరువు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోయి రైతులు, వ్యవసాయ కూలీలకు ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని పి. నారాయణస్వామి అన్నారు.
ఉపాధి కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని, అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. మరోవైపు పశువులకు పశుగ్రాసం అందక మూగజీవాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామాలకు తాగునీరు, పశువులకు పశుగ్రాసం అందించడంతో పాటు కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని, పంటలను కాపాడుకునేందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ఉచితంగా అందించాలని సీపీఐ నాయకులు కోరారు. పంట నష్టపరిహారం, బీమా, గిట్టుబాటు ధర వంటి అంశాల్లో రైతులకు న్యాయం చేయాలని అన్నారు.
రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర లభించక మార్కెట్లు, రోడ్లపై పంటలను విక్రయించాల్సిన పరిస్థితులు గతంలోనూ ఏర్పడ్డాయని పేర్కొన్నారు.
ఆత్మకూరు మండలంలో మినీ రిజర్వాయర్ ఏర్పాటు చేసి హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి నీటిని మళ్లించి పంట భూములకు సాగునీరు అందించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించాలని కోరారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆగస్టు 17న నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పి. నారాయణస్వామి పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలకు కూడా వెనుకాడబోమని సీపీఐ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమానికి సీపీఐ మండల కార్యదర్శి బండారు శివ అధ్యక్షత వహించగా, జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున, జిల్లా కార్యవర్గ సభ్యులు పి. రామకృష్ణ, రాప్తాడు కార్యదర్శి ఎం. రమేష్, నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎన్. రామకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధనంజయ, దుర్గ ప్రసాద్, రామాంజి, నల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.