విజయవాడలో డీఎస్సీ 2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ

  • మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ కాదు.. టీచర్ల భారీ ర్యాలీ

DSC 2025: విజయవాడలో డీఎస్సీ 2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ స్వరాజ్ మైదాన్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. డీఎస్సీ 2025 నియామకాలపై వైసీపీ చేస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఈ ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో డీఎస్సీ 2025 ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొని తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ‘తమది మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ కాదు’, ‘నిందలు మానుకో.. నిజం తెలుసుకో’ అంటూ ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. డీఎస్సీ 2025 ద్వారా ప్రతిభ ఆధారంగా తాము ఉద్యోగాలు సాధించామని, తమపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ‘పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెబుతాం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమపై బురద చల్లడం మానుకోవాలని హెచ్చరించారు.

Read More ఏపీలోనే అతిపెద్ద రన్‌వే.. మోదీ చేతుల మీదుగా విశాఖ ఎయిర్‌పోర్ట్ షురూ!

2025 డీఎస్సీ ప్రతిభకు పట్టం కట్టిన డీఎస్సీ అని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. తమ నియామకాలను రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాస్పదం చేయొద్దని, నిరుద్యోగులు, అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంపై బాధ్యతగా మాట్లాడాలని కోరారు. తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా మెరిట్ ఆధారంగా ఎంపికయ్యామని స్పష్టం చేశారు.

వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండించారు. ‘బురద చల్లడం మానుకుని బుద్ధి తెచ్చుకోండి’, ‘ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దు’ అంటూ నినాదాలు చేశారు. తమపై తప్పుడు ప్రచారం కొనసాగిస్తే మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. డీఎస్సీ 2025 నియామకాలపై తమ వైఖరిని స్పష్టం చేసేందుకే ఈ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

🕒 16 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/self-esteem-rally-of-dsc-2025-teachers-in-vijayawada/article-21697

Tags: