సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను విజయవంతం చేయండి - దుర్గం మల్లికార్జున్ గౌడ్

విశ్వంభర,​ వికారాబాద్ జిల్లా:ఈ నెల 18వ తేదీ మంగళవారం నాడు సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు, వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ దుర్గం మల్లికార్జున్ గౌడ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఉదయం 9 గంటలకు వికారాబాద్ పట్టణంలోని BjR చౌరస్తాలో వేడుకలు ప్రారంభమవుతాయని, 10 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు డాక్టర్ సత్యనారాయణ గౌడ్ నివాసంలో బందేయ్య గౌడ్ రచించిన పుస్తకావిష్కరణ జరుగుతుందని పేర్కొన్నారు.సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్, నాగరాజ్ గౌడ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు గౌడ సోదరులు, ప్రజలు విరివిగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

🕒 16 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/make-sardar-sarvai-papanna-jayanthi-celebrations-a-success-durgam/article-21711

Tags: