విమల్ యాడ్‌పై మహారాష్ట్ర FDA సీరియస్.. ముగ్గురు హీరోలకు నోటీసులు

విమల్ యాడ్‌ వివాదం.. షారుఖ్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు నోటీసులు

Vimal Pan Masala: విమల్ ఏలైచీ’ యాడ్‌ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ప్రకటనలో నటించిన బాలీవుడ్‌ స్టార్స్‌ షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘విమల్ ఏలైచీ’ పేరుతో వస్తున్న ప్రకటన ద్వారా మహారాష్ట్రలో నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారన్న అనుమానంతో FDA ఈ చర్యలు చేపట్టింది.

ఈ యాడ్‌లో ‘విమల్’ బ్రాండ్ పేరును ఉపయోగించడం వల్ల నిషేధిత పాన్ మసాలా ఉత్పత్తితో వినియోగదారులకు పరోక్షంగా అనుబంధం ఏర్పడే అవకాశం ఉందని FDA పేర్కొంది. దీంతో ప్రకటనలో తమ పాత్ర ఏంటో, ఉత్పత్తి ప్రచారంలో ఎందుకు పాల్గొన్నారో వివరణ ఇవ్వాలని ముగ్గురు నటులను అధికారులు కోరారు. అలాగే సంబంధిత ప్రచార కంటెంట్‌ను నిలిపివేయాలని, సోషల్ మీడియా నుంచి తొలగించాలని కూడా ఆదేశించినట్లు సమాచారం. 

Read More మెగా అభిమానులకు పూనకాలే.. 'బరి'లో దిగిన తండ్రీకొడుకులు

ముగ్గురు నటులకు తమ వివరణను 15 రోజుల్లోగా సమర్పించాలని FDA గడువు ఇచ్చింది. నిషేధిత ఉత్పత్తిని పరోక్షంగా ప్రచారం చేసే ప్రకటనలపై చర్యలు తీసుకునే క్రమంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించి చట్టపరమైన చర్యలు, జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. 

‘విమల్ ఏలైచీ’ ప్రకటనలో నటించిన బాలీవుడ్ ప్రముఖులపై ఒకేసారి FDA చర్యలు తీసుకోవడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏలైచీ వంటి ఉత్పత్తి పేరుతో పాన్ మసాలా బ్రాండ్‌ను పరోక్షంగా గుర్తుకు తెచ్చేలా ప్రకటనలు చేయవచ్చా? అనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. FDA మాత్రం ఈ ప్రకటనపై ప్రాథమికంగా అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంటూ నటుల వివరణ కోరింది. 

🕒 16 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/movies/maharashtra-fda-serious-notices-to-three-heroes-on-vimal-ad/article-21713

Tags: