బీజేపీ, కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన 100 మంది కార్యకర్తలు
- బాల్కొండలో బీఆర్ఎస్‌లో చేరిన 100 మంది.. కండువాలు కప్పి ఆహ్వానించిన వేముల
Telangana News: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు జరిగాయి. కమ్మర్‌పల్లి మండలం కొనాపూర్, కేఎస్ తండాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు వేముల అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు.
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని వేముల అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో మరింత మంది వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.