గాంధీ భవన్‌లో ఎస్ఐఆర్ పై అవగాహన సమావేశం.

పాల్గొన్న పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ 

విశ్వంభర, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  ఆధ్వర్యంలో  హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ, ఓటర్ల జాబితాల ప్రాముఖ్యత, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా తీసుకోవాల్సిన చర్యలు, ఓటర్లకు కల్పించాల్సిన అవగాహన తదితర అంశాలపై చర్చించారు. ఈ అవగాహన కార్యక్రమంలో తెలంగాణ  ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ దశా దిశా నిర్దాశనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటు హక్కును సక్రమంగావినియోగించుకునేలా, ఓటరు జాబితాలో తన పేరు మరియు వివరాలను పరిశీలించుకోవాలని నాయకులు సూచించారు. అర్హులైన ఓటర్లు ఎవరూ జాబితాలో తమ పేరు లేకుండా మిగిలిపోకుండా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారుప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని సమావేశంలో సూచించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ తో జిల్లా కోఆర్డినేటర్లు, ఇన్చార్జులు, వివిధ కార్పొరేట్ చైర్మన్ లు పాల్గొన్నారు

🕒 16 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/awareness-meeting-on-sir-at-gandhi-bhavan/article-21705

Tags: