అర్చకుడు కాదు.. కీచకుడు! గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి

అర్చకుడు కాదు.. కీచకుడు! గుడిలో మైనర్ బాలికపై లైంగిక దాడి

  • ఆలయంలో మైనర్ బాలికపై అర్చకుడి లైంగిక దాడి

Ramachandrapuram: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఆలయంలో మైనర్ బాలికపై అర్చకుడు సాయన్న లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. బాలికకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మైనర్ బాలిక కావడంతో కేసును పోలీసులు సున్నితంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది.

Tags: