రహదారి లేదు.. వంతెన లేదు.. వాగు దాటి బడికి విద్యార్థులు
- కంటుగూడ విద్యార్థులకు తప్పని వాగు ప్రయాణం.. రహదారి, వంతెన కోసం ఎదురుచూపులు
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ పరిధిలోని కంటుగూడ గ్రామస్థులు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగు దాటాల్సిన దుస్థితి నెలకొంది. కంటుగూడ గ్రామం నుంచి గుమ్మలక్ష్మీపురం మండలం తాటిశీల పాఠశాలకు వెళ్లే విద్యార్థులు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే వాగును దాటి పాఠశాలకు చేరుకుంటున్నారు.
వాగులో నీటి ప్రవాహం పెరిగిన సమయంలో విద్యార్థులు జారిపడే ప్రమాదం ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సరైన రహదారి లేకపోవడంతో గ్రామస్థులు కూడా నిత్యావసర పనుల కోసం రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతోందని స్థానికులు తెలిపారు. చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కంటుగూడ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు వాగుపై శాశ్వత వంతెన నిర్మించాలని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా, వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.