పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం

పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పయనం

  • అస్వస్థతతో పవన్ కల్యాణ్.. రాజమండ్రి పర్యటన మధ్యలోనే ముగింపు

AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. రాజమండ్రి పర్యటనలో భాగంగా సతీమణి అన్నా కొణిదెలతో కలిసి సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్.. అనంతరం తీవ్ర జ్వరం కారణంగా పర్యటనను మధ్యలోనే ముగించుకున్నారు. రాజమండ్రిలోనే వైద్యుల బృందం పవన్ కల్యాణ్‌ను పరీక్షించి చికిత్స అందించినట్లు సమాచారం.

వైద్యుల పరీక్షలు, సూచనల అనంతరం పవన్ కల్యాణ్ రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్‌కు బయలుదేరారు. జ్వరం తీవ్రంగా ఉండటంతో రాజ్‌భవన్‌లో నిర్వహించనున్న ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం. దీంతో పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై జనసేన శ్రేణులు, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Read More పుష్కరాలకు అన్నవరం సిద్ధం.. ప్రసాదం తయారీపై ప్రత్యేక దృష్టి

ఇటీవల ముంబైలో పవన్ కల్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంది. ప్రస్తుతం జ్వరంతో అస్వస్థతకు గురికావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Tags: