ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కొత్త క్వార్టర్స్.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- నూతన క్వార్టర్స్‌ను GADకు అప్పగించిన సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: అమరావతిలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం ఈ భవన సముదాయాన్ని సాధారణ పరిపాలనా శాఖ (GAD)కు అప్పగించారు. ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నూతన క్వార్టర్స్‌లో కల్పించిన వసతులను అధికారులతో కలిసి పరిశీలించారు. భవన సముదాయంలో నివాసానికి, ప్రజాప్రతినిధుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణ పనులు, అందుబాటులో ఉన్న వసతులు, నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. అమరావతిలో పాలనా కార్యకలాపాలు మరింత సజావుగా సాగేందుకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని అధికారులు తెలిపారు. నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అందుబాటులోకి రావడంతో ప్రజాప్రతినిధులకు మెరుగైన వసతులు కల్పించినట్లయింది.