రైతుల కోసం సెరెంటికా హెల్ప్‌లైన్.. ప్రారంభించిన అనంతపురం కలెక్టర్ ఓ. ఆనంద్

  • రైతుల సమస్యలకు ఇక నేరుగా పరిష్కారం.. సెరెంటికా ప్రత్యేక హెల్ప్‌లైన్ ప్రారంభం

Anantapur Collector: భారత స్వాతంత్య్ర దినోత్సవ సంధ్య వేళ అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని రైతులతో సమాచార మార్పిడి, పారదర్శకత, నమ్మకాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సెరెంటికా కంపెనీ ప్రత్యేక ఫార్మర్స్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ గురువారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సెరెంటికా హెల్ప్‌లైన్ నంబర్ 18003097701ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సెరెంటికా కంపెనీ ప్రతినిధులు తేజల ఆనంద్, రామదుర్గ అనిల్‌కుమార్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఓ. ఆనంద్ మాట్లాడుతూ.. విద్యుత్ పునరుత్పత్తి రంగంలో భాగంగా జిల్లాకు వచ్చిన కంపెనీలకు, రైతులకు మధ్య ఎలాంటి అంతరం ఉండకూడదన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి రైతులు పలు సందర్భాల్లో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ అంశాన్ని సెరెంటికా కంపెనీ ప్రతినిధులతో చర్చించగా, వారు వెంటనే స్పందించి రైతుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

Read More టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు

ఈ హెల్ప్‌లైన్ ద్వారా రైతులు నేరుగా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి తమ సమస్యలు, సందేహాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు, కంపెనీకి మధ్య నేరుగా సమాచార మార్పిడి జరిగేలా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్పారు. ఇతర విద్యుత్ ప్రాజెక్టు కంపెనీలు కూడా ఇదే తరహాలో రైతుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

గాలిమరలు, సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు సమయంలో రైతులకు ఎదురయ్యే సమస్యలు, అపోహలు, సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ హెల్ప్‌లైన్ దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు. రైతులు 18003097701 నంబర్‌కు కాల్ చేసి సెరెంటికా విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చని చెప్పారు. రైతులు–కంపెనీ మధ్య స్పష్టమైన జవాబుదారీతనంతో కూడిన సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇది కీలకమైన అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

సెరెంటికా ఫార్మర్స్ హెల్ప్‌లైన్ ద్వారా ప్రయోజనాలు:

సెరెంటికా విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి రైతులు తమ సందేహాలు, సమస్యలను 18003097701 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా భూమికి సంబంధించిన అంశాలు, భూమి పరిహారం, నష్టపరిహారం చెల్లింపులు వంటి విషయాలపై నేరుగా సమాచారం పొందే అవకాశం ఉంటుంది.

అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన సమయాలు, రైతుల పొలాల్లో రాకపోకలు, నిర్మాణ పనుల వల్ల కలిగే ఇబ్బందులు వంటి అంశాలపై కూడా హెల్ప్‌లైన్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. విండ్ టర్బైన్లు, సోలార్ ప్యానెళ్ల వద్ద పాటించాల్సిన రక్షణ, భద్రతా చర్యలపై రైతులు సమాచారం పొందవచ్చు.

గ్రామాల్లో ప్రాజెక్టులకు సంబంధించి ఎదురయ్యే ఇతర సమస్యలను కూడా రైతులు హెల్ప్‌లైన్ ద్వారా కంపెనీ దృష్టికి తీసుకెళ్లవచ్చు. దీంతో రైతుల సమస్యలు నేరుగా కంపెనీకి చేరడంతో పాటు, వాటి పరిష్కార ప్రక్రియలో పారదర్శకత పెరిగే అవకాశం ఉంది. రైతులకు అందుబాటులో ఉండే ఈ హెల్ప్‌లైన్ ద్వారా ప్రాజెక్టులపై ఉన్న అపోహలు తొలగించి, రైతులు–కంపెనీ మధ్య నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని సెరెంటికా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

🕒 14 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/anantapur-collector-o-anand-started-the-serentica-helpline-for-farmers/article-21661

Tags:  

Advertisement

LatestNews

మహాత్మా జ్యోతిబా ఫూలే – సావిత్రిబాయి ఫూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం. -తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్  గూడూరు శ్రీనివాస్
5 కి.మీ జాతీయ జెండాతో గిన్నిస్ రికార్డు.. హరియాణాలో ఘనంగా త్రివర్ణ యాత్ర
రైతుల కోసం సెరెంటికా హెల్ప్‌లైన్.. ప్రారంభించిన అనంతపురం కలెక్టర్ ఓ. ఆనంద్
విమలక్క గళం.. ఐదు దశాబ్దాల ప్రజా ఉద్యమ చరిత్ర..-మన్నారం నాగరాజు, సామాజిక రాజకీయ విశ్లేషకులు.
మొబైల్‌ అతిగా వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం.. షకీలా సంచలన హెచ్చరిక
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ విడుదలపై క్లారిటీ.. జూన్ 11, 2027నే రిలీజ్‌కు ప్లాన్
బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ ఎంతో దోహదం - గూడూరు శ్రీనివాస్