పరకాలలో సీఎం రేవంత్ పర్యటన.. అంగన్‌వాడీ టీచర్లు, పలువురు నేతలు అదుపులోకి
- సీఎం రేవంత్ పర్యటన.. అంగన్‌వాడీ టీచర్ల ముందస్తు అరెస్ట్
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి పరకాల పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు శ్రీకారం చుట్టారు. పరకాలలో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.
హనుమకొండ, ములుగు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. వివిధ సంఘాలకు చెందిన విద్యార్థి నాయకులు, స్వేరోస్ కార్యకర్తలు, గ్రీన్‌ఫీల్డ్ హైవే భూ బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు.
సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. పలు ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ముందస్తు అరెస్టులపై ఆయా సంఘాల నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరికాదని వారు పేర్కొంటున్నారు.
గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం భూములు కోల్పోతున్న బాధితులు, వివిధ సంఘాల నాయకులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ ముందస్తు అరెస్టులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన పూర్తయ్యే వరకు మరిన్ని ముందస్తు చర్యలు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.