చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. -శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం
చేనేత సహకార సంఘానికి కొందరు వ్యక్తుల వల్ల సమస్యలు
- చేనేత కార్మికుల ప్రధాన డిమాండ్లు
- 50 సంవత్సరాలు దాటిన పురుష చేనేత కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ మంజూరు చేయాలి.
- రైతు భరోసా తరహాలో ‘పద్మశాలి భరోసా’ పథకాన్ని అమలు చేసి చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలి.
- చేనేత కార్మికులు, పద్మశాలి కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య కార్డులు మంజూరు చేసి అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో వాటిని ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలి.
- చేనేత కార్మికులు తయారు చేసే వస్త్రాలను ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వ కొనుగోలు విధానంలో చేనేతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- తెలంగాణలో తయారయ్యే చేనేత వస్త్రాలకు దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి.
- చేనేత ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా బ్రాండింగ్, ప్యాకేజింగ్, ఆన్‌లైన్ మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు కల్పించాలి.
- చేనేత కార్మికులకు అందాల్సిన త్రిఫ్ట్ ఫండ్ ప్రతి నెలా క్రమం తప్పకుండా అందేలా చూడాలి.
- చేనేత ఉత్పత్తులకు అవసరమైన నూలు, రంగులు, రసాయనాల ధరలను నియంత్రించి సబ్సిడీపై ముడిసరుకు అందించాలి.
- చేనేత కార్మికులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చి ఉత్పత్తి నాణ్యత, డిజైన్లలో మార్పులు తీసుకురావాలి.
- యువత చేనేత రంగం వైపు ఆకర్షితులయ్యేలా కొత్త డిజైన్లు, ఆధునిక మార్కెటింగ్ విధానాలు, శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి.
- చేనేత కుటుంబాల్లోని మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి.
విశ్వంభర, ఎల్బీనగర్: శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘం, ఎల్బీనగర్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్య్ర సమరయోధులను, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పాలక సంఘం సభ్యులు తాటి ఎల్లయ్య, తిరందాసు నరసింహ మాట్లాడుతూ.. చేనేత రంగం మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని, లక్షలాది కుటుంబాలకు చేనేత వృత్తి జీవనాధారంగా ఉందని తెలిపారు. అయితే చేనేత కార్మికులు ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. ఇకముందు కూడా ప్రభుత్వం చేనేత పక్షపాతిగా వ్యవహరిస్తూ చేనేత కార్మికుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.
నూతనంగా ఏర్పాటు చేసుకున్న శ్రీ దేవ భావన ఋషి చేనేత సహకార సంఘానికి కొందరు వ్యక్తుల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సమస్యలపై ఇప్పటికే ఎడి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.ఈ విషయాన్ని సంబంధిత అధికారులు సీరియస్‌గా పరిగణించి, సమస్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సంఘానికి న్యాయం చేయాలని కోరారు. సంఘం అభివృద్ధికి ఆటంకం కలిగించే సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, చేనేత కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తూ, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు, మార్కెటింగ్ అవకాశాలు, ఆర్థిక సహాయం అందించాలని సంఘం ప్రతినిధులు కోరారు. చేనేత రంగాన్ని కాపాడటం అంటే కేవలం ఒక వృత్తిని కాపాడటం కాదని, చేనేతపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాల భవిష్యత్తును కాపాడటమేనని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారులు, చేనేత సంఘాలు సమన్వయంతో పనిచేస్తే తెలంగాణ చేనేత వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంగేపు విజయలక్ష్మి, కే సత్యనారాయణ, తాటి అర్చన తో పాటుగా సంగం వాటా సభ్యులు పాల్గొన్నారు