5 కి.మీ జాతీయ జెండాతో గిన్నిస్ రికార్డు.. హరియాణాలో ఘనంగా త్రివర్ణ యాత్ర
- హరియాణాలో దేశభక్తి వెల్లువ.. 5 కి.మీ పొడవైన జాతీయ జెండా ప్రదర్శన
National Flag: స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా హరియాణాలోని పల్వాల్ జిల్లాలో అరుదైన ఘనత నమోదైంది. 5 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శిస్తూ నిర్వహించిన భారీ త్రివర్ణ యాత్ర గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. దేశభక్తిని చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారీ జాతీయ జెండాను చేతబూని పల్వాల్‌లోని ప్రధాన మార్గాల్లో నిర్వహించిన త్రివర్ణ యాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు, యువత, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాతో ముందుకు సాగారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఈ భారీ కార్యక్రమం దేశభక్తి సందేశాన్ని చాటడంతో పాటు ప్రజల్లో జాతీయ భావాన్ని మరింత పెంపొందించింది. వేలాది మంది ఒకే జెండా కింద కదిలిన దృశ్యాలు పల్వాల్‌లో పండుగ వాతావరణాన్ని తలపించాయి. 5 కి.మీ పొడవైన జాతీయ జెండా ప్రదర్శనతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం పట్ల నిర్వాహకులు, పాల్గొన్న ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.