హౌస్ ఆఫ్ లార్డ్స్‌లోకి తెలంగాణ బిడ్డ.. ఉదయ్ నాగరాజుకు హరీశ్ రావు అభినందనలు

Harish Rao: బ్రిటన్ పార్లమెంట్‌లోని ప్రతిష్ఠాత్మక హౌస్ ఆఫ్ లార్డ్స్‌లోకి అడుగుపెట్టిన తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజును బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఉదయ్ నాగరాజు సాధించిన అరుదైన ఘనత తెలంగాణతో పాటు దేశానికి కూడా ఎంతో గర్వకారణమని హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని, ఆయన సాధించిన ఈ విజయాన్ని ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయంగా భావించాలని అన్నారు. ఉదయ్ నాగరాజు ప్రయాణం యువతకు, ముఖ్యంగా తెలంగాణకు చెందిన ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని హరీశ్ రావు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి తెలంగాణకు, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

🕒 13 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/harish-rao-congratulates-telanganas-son-uday-nagaraj-on-entering-the/article-21641

Tags: