న్యూ అంబేద్కర్‌ కాలనీలో మహిళల భద్రతపై ఆందోళన.. స్పందించాలని అధికారులకు విజ్ఞప్తి

  • అనంతపురం న్యూ అంబేద్కర్‌ కాలనీలో వివాదాలు.. 

Anantapur New Ambedkar Colony,: అనంతపురం జిల్లా కేంద్రంలోని టీవీ టవర్‌–వనమిత్ర బ్యాక్‌సైడ్‌లో ఉన్న న్యూ అంబేద్కర్‌ కాలనీలో నెలకొన్న సమస్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో కొంతమంది వ్యక్తుల ప్రవర్తన కారణంగా తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపించారు.

ముఖ్యంగా మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తిస్తూ మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొంతమంది మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు అసభ్యకరమైన సందేశాలు పంపడం, అనుచితంగా మాట్లాడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. రవిదాస్‌ కాలనీకి చెందిన రామ్మూర్తి, నరేంద్రలపై సులోచన, లక్ష్మీదేవి, జయమ్మ తదితరులు ఆరోపణలు చేసినట్లు స్థానికులు తెలిపారు. కాలనీలో ప్రశాంత వాతావరణం దెబ్బతింటోందని, కుటుంబాలతో నివసించేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు పేర్కొన్నారు.

Read More మెడికో ప్రియాంక తండ్రి ఆవేదన.. “నా కూతురి బాధ ప్రభుత్వానికి కనిపించడం లేదా?”

కొంతమంది స్థానిక నాయకులు వివాదాలను రెచ్చగొడుతున్నారని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలనీలో నెలకొన్న పరిస్థితులపై సమగ్రంగా విచారణ జరిపి, మహిళల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను అరికట్టి కాలనీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని వారు అధికారులను విజ్ఞప్తి చేశారు. అయితే స్థానికులు చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వివరణ వెలువడాల్సి ఉంది

🕒 11 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/an-appeal-to-the-authorities-to-respond-to-the-concern/article-21635

Tags: