వర్షాలతో ఉప్పల్ నల్లచెరువుకు జలకళ

వర్షాలతో ఉప్పల్ నల్లచెరువుకు జలకళ

విశ్వంభర, ఉప్పల్ : హైడ్రా పునరుద్ధరిస్తున్న హైదరాబాదు ఉప్పల్ నల్లచెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద నీటితో నిండిపోయి జలకళను సంతరించుకుంది. గతంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో మురికికూపంగా మారిన చెరువును ఆక్రమణలు తొలగించి సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నారు. చెరువుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరేందుకు రెండు ఇన్‌లెట్లు, అదనపు నీరు మూసీ నదిలోకి వెళ్లేందుకు ఔట్‌లెట్‌ను హైడ్రా అభివృద్ధి చేసింది. దీంతో వర్షపు నీరు చెరువులోకి చేరడంతో పాటు పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ సమస్య తగ్గింది. నల్లచెరువులో 10 ఎకరాలకు పైగా ఆక్రమణలు తొలగించి సుమారు 70 ఎకరాల విస్తీర్ణాన్ని పునరుద్ధరించారు. దాదాపు రూ.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వాకింగ్ ట్రాక్, ప్రధాన బండ్ బలోపేతం, పిల్లల ఆట స్థలం, ఓపెన్ జిమ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. హైడ్రా తొలి దశలో అభివృద్ధి చేస్తున్న ప్రధాన చెరువుల్లో ఉప్పల్ నల్లచెరువు ఒకటి. పనులు పూర్తయ్యాక ఇది నగరవాసులకు మరో అందమైన జలవనరుగా, విశ్రాంతి కేంద్రంగా అందుబాటులోకి రానుంది.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/aquaculture-of-uppal-black-pond-with-rains/article-20642

Tags: