తల్లిపాలతోనే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం
- : ఏసిడిపిఓ నీరజ
విశ్వంభర, నెల్లికుదురు: తల్లిపాల తోనే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఐసిడిఎస్ ఎ సి డి పి ఓ నీరజ అన్నారు. నెల్లికుదురు మండలం వావిలాల అంగన్వాడి సెక్టార్ కాస్య తండాలో సర్పంచ్ బోడ నరసింహ నాయక్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. పుట్టిన ప్రతి బిడ్డకు గంటలోపు ముర్రుపాలు వెంటనే పట్టించాలని చెప్పారు. తల్లిపాలలోనే రోగనిరోధక శక్తి ఉంటుందన్నారు, శిశువులకు ఆరు మాసాలు వచ్చేంతవరకు క్రమం తప్పకుండా తాగించాలని సూచించారు. ఆరు నెలల అనంతరం హనుమంత ఆహారం ఇవ్వాలన్నారు.ప్రభుత్వం సరఫరా చేసే ఫీడింగును సద్వినియోగం చేసుకోవాలని చిన్నారులు గర్భిణీలు,బాలింతలకు సూచించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాలు విశిష్టత, పోషకాహారం పై వేసిన చార్టు ఆకట్టుకుంది.అనంతరం పుట్టిన ప్రతి బిడ్డకు ముర్రు పాలు పట్టిస్తామని గర్భిణీలు తల్లులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ నీరజ,పంచాయతీ కార్యదర్శి మహేష్, వార్డు సభ్యులు స్రవంతి, కాస్యతండా పరిధి అంగన్వాడీ టీచర్లు వరాలమ్మ,పద్మ, వావిలాల సెక్టార్ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గర్భిణీలు బాలింతలు కిశోర బాలికలు పాల్గొన్నారు.