అనంతపురంలో MHPS నూతన కార్యవర్గం ఎంపిక: జిల్లా కన్వీనర్‌గా కొడవండ్ల నరేష్
- అనంతపురంలో ఎంహెచ్‌పీఎస్ నూతన కమిటీ.. దళితుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ప్రకటన
Press Club Anantapur: అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్‌లో ఎంహెచ్‌పీఎస్ (MHPS) నూతన కమిటీని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అవుకు చిన్న ఈశ్వరయ్య, అనంతపురం జిల్లా అధ్యక్షుడు హెచ్. నాగన్న (రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్) ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కన్వీనర్‌గా కొడవండ్ల నరేష్, జిల్లా ఉపాధ్యక్షుడిగా రుద్రంపేట జె. నల్లప్ప, ఉరవకొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా పడమటి నారాయణపురం ఎం. రామాంజనేయులు, కూడేరు మండల అధ్యక్షుడిగా మరుట్ల తిరుపాలుకు నూతన బాధ్యతలు అప్పగించారు. నూతనంగా ఎన్నికైన నాయకులను సభలో ఘనంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ కొడవండ్ల నరేష్ మాట్లాడుతూ, తమపై పార్టీ ఉంచిన బాధ్యతలను శిరసావహించి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, దళితుల హక్కుల పరిరక్షణ కోసం ఎంహెచ్‌పీఎస్ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. సంస్థను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సామ్రాట్ మధు, ఎంఎస్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూటూరు రామాంజనేయులు, ఆదినారాయణ, బోయ దొర, రాయలసీమ అధ్యక్షుడు నారాయణస్వామి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.