కడపలో దారుణం.. చికెన్ పకోడీ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ
- చికెన్ పకోడీ గొడవ.. అన్నను గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు
Kadapa news: కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో చికెన్ పకోడీ విషయంలో జరిగిన గొడవ విషాదాంతమైంది. చిన్నపాటి వివాదం అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీయడంతో తమ్ముడు అన్నను గొడ్డలితో నరికి చంపిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి సురేష్ బయట నుంచి చికెన్ పకోడీ తీసుకురావడంతో.. శనివారం పూట చికెన్ పకోడీ ఎందుకు తీసుకొచ్చావంటూ అతని అన్న వెంకటసుబ్బయ్య దూషించినట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
అన్న మాటలతో ఆగ్రహానికి గురైన సురేష్ ఇంట్లో నుంచి గొడ్డలిని తీసుకొచ్చి వెంకటసుబ్బయ్య తలపై బలంగా దాడి చేశాడు. అనంతరం బయటకు వెళ్లి మద్యం సేవించి తిరిగి ఇంటికి వచ్చిన సురేష్.. అప్పటికే తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న అన్నపై మరోసారి దాడికి పాల్పడ్డాడు. గుండెపై గొడ్డలితో దాడి చేయడంతో వెంకటసుబ్బయ్య తీవ్ర రక్తస్రావానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
కాగా, అన్నదమ్ములిద్దరికీ గతంలోనే వివాహాలు జరిగినప్పటికీ.. మద్యానికి బానిస కావడంతో వారి భార్యలు వారిని వదిలి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. మద్యం అలవాటుతో పాటు కుటుంబంలో నెలకొన్న వివాదాలు ఈ ఘటనకు కారణమయ్యాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నపాటి మాటామాటా చివరకు హత్యకు దారితీయడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.