ములుగులో పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత సమతా
- మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు లొంగుబాటు.. రూ.20 లక్షల రివార్డు
Kakarla Samatha, Maoist: మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమతా ములుగులో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన సమతా.. ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానాన్ని స్వీకరించి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 1985లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆమె, అంచెలంచెలుగా పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. 2003లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఎదిగిన సమతా.. పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. లొంగుబాటు అనంతరం ప్రభుత్వ పునరావాస విధానం కింద సమతాకు రూ.20 లక్షల రివార్డు అందించారు.
పోలీసుల సమక్షంలో లొంగిపోయిన ఆమెకు ప్రభుత్వం అందించే పునరావాస సదుపాయాలను కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. దీర్ఘకాలంగా మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగిన వ్యక్తి లొంగిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలంగాణకు చెందిన మిగిలిన యాక్టివ్ మావోయిస్టు కేడర్లు కూడా ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకుని జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. హింసా మార్గాన్ని వీడి సాధారణ జీవితం గడపాలని సూచించారు. ప్రభుత్వ పునరావాస విధానం ద్వారా లొంగిపోయిన వారికి అవసరమైన సహాయం అందిస్తామని పోలీసులు తెలిపారు. సమతా లొంగుబాటుతో తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలపై మరోసారి చర్చ మొదలైంది.