బెంగళూరులో మూడేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి.. తీవ్ర గాయాలు

  • అంగన్‌వాడీ నుంచి ఇంటికి వస్తుండగా దాడి.. చిన్నారిని చుట్టుముట్టిన ఐదు కుక్కలు

Bengaluru Street Dogs Attack: బెంగళూరులో మూడేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బెంగళూరులోని చిక్కజాల సమీపంలోని సదహళ్లి ప్రాంతంలో అంగన్‌వాడీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న మూడేళ్ల బాలుడిపై ఐదు వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. బాలుడు ఒంటరిగా వెళ్తుండగా కుక్కలు అతడిని చుట్టుముట్టి కిందపడేసి పలుమార్లు కరిచినట్లు స్థానికులు తెలిపారు.

కుక్కలు బాలుడిపై దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కుక్కల దాడితో బాలుడు భయంతో కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు, స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న వారు కుక్కలను తరిమికొట్టి చిన్నారిని వాటి నుంచి రక్షించారు. దీంతో బాలుడికి మరింత ప్రమాదం తప్పింది. కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

Read More అంతరిక్ష కేంద్రం నుంచి భారతీయులకు ప్రత్యేక సందేశం.. రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

అక్కడ వైద్యులు చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. బాలల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీధికుక్కల బెడదను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా అంగన్‌వాడీలు, పాఠశాలలు, నివాస ప్రాంతాల సమీపంలో వీధికుక్కల సంచారం పెరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నారిపై జరిగిన ఈ దాడితో స్థానిక తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది.

🕒 11 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/national/a-three-year-old-boy-was-seriously-injured-in-an-attack-by/article-21621