సిరిపురం ఎస్సీ బాలుర వసతి గృహంలో సంక్షేమాధికారికి ఘనంగా వీడ్కోలు
విశ్వంభర, మర్పల్లి : సీరిపురం ఎస్సీ బాలుర వసతి గృహ సంక్షేమాధికారి తులజారామ్ గౌడ్ మోమిన్‌పేట ఎస్సీ బాలుర వసతి గృహానికి బదిలీ కావడంతో శనివారం ఆయనకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. అదే కార్యక్రమంలో నూతన సంక్షేమాధికారి శ్రీనివాస్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పలువురు ప్రసంగిస్తూ తులజారామ్ గౌడ్ సేవలను కొనియాడి, ఆయన కొత్త బాధ్యతల్లో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన సంక్షేమాధికారి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వసతి గృహ సిబ్బంది, హాస్టల్ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు