రూ.30 లక్షలకే కోటి ఫేక్ నోట్లు.. కారులో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు

  • ఫేక్ కరెన్సీ నెట్‌వర్క్‌పై పోలీసుల దాడి.. మాస్టర్‌మైండ్ కోసం గాలింపు

Fake Currency: ముంబై విరార్‌లో భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని తరలిస్తున్న ముఠాను వసాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు రూ.30 లక్షలకు రూ.1 కోటి విలువైన నకిలీ నోట్లను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబై–అహ్మదాబాద్ హైవేపై కారులో నకిలీ నోట్లను తరలిస్తున్న సమయంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కారులో రూ.500 ముఖ విలువ కలిగిన 20,000 నకిలీ నోట్లు బయటపడ్డాయి. వీటి మొత్తం విలువ రూ.1 కోటిగా అధికారులు వెల్లడించారు. నకిలీ నోట్లను భారీ మొత్తంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి కోపర్‌గావ్‌కు చెందిన ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు.

నకిలీ కరెన్సీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరికి సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నారు? ఈ నెట్‌వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అరెస్టైన నిందితుడిని విచారిస్తూ నకిలీ నోట్ల సరఫరా వ్యవస్థకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. భారీ మొత్తంలో నకిలీ నోట్లు పట్టుబడటం ముంబైలో కలకలం రేపింది. నకిలీ కరెన్సీ చలామణికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. అరెస్టైన వ్యక్తి నుంచి లభించిన సమాచారంతో నెట్‌వర్క్‌లోని ఇతర సభ్యులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Read More సోలో ట్రెక్కింగ్‌కు వెళ్లి కనిపించకుండా పోయిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్

🕒 11 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/national/6a7ab2702124d/article-21603

Related Posts