ఢిల్లీలో 21 మంది మహిళా టెలికాలర్లు అరెస్ట్.. ఫేక్ కాల్ సెంటర్ గుట్టురట్టు
- తెలంగాణలో 22 సైబర్ కేసులతో లింక్.. ఢిల్లీలో మూడు ఫేక్ కాల్ సెంటర్లు
: అమాయక ప్రజలను మోసం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఫేక్ కాల్ సెంటర్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఢిల్లీలోని శివ మార్కెట్ ప్రాంతంలో మూడు ఫేక్ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న వ్యవహారంపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్ సెంటర్లకు సంబంధించి తెలంగాణలో నమోదైన 22 సైబర్ క్రైమ్ కేసుల్లో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల దర్యాప్తులో ఉత్తరాదికి చెందిన లలిత్ సింగ్, కులదీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ మూడు మోసపూరిత కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు అమాయక ప్రజలకు ఫోన్లు చేసి తమను బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులుగా పరిచయం చేసుకునేవారని పోలీసులు తెలిపారు. ముందుగానే సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం బాధితులను నమ్మించి, వివిధ రకాల ఛార్జీలు, ఇతర పేర్లతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బాధితులను తమ మాటలతో నమ్మించి వారి నుంచి డబ్బులు బదిలీ చేయించుకునే విధంగా కాల్ సెంటర్‌లో పనిచేసే టెలికాలర్లకు ప్రత్యేక స్క్రిప్ట్‌లు అందించినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా అనేక మంది ప్రజలను మోసం చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో నమోదైన సైబర్ కేసులను పరిశీలించిన సమయంలో ఈ కాల్ సెంటర్లతో సంబంధాలు బయటపడటంతో పోలీసులు ఢిల్లీలో ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో కాల్ సెంటర్ నిర్వాహకులు పోలీసులకు చిక్కకుండా పరారైనప్పటికీ, అక్కడ పనిచేస్తున్న 21 మంది మహిళా టెలికాలర్లు, ఒక బ్యాంకు ఖాతాదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సైబర్ మోసాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. కాల్ సెంటర్ నిర్వాహకుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
అరెస్టైన మహిళా టెలికాలర్లలో కొందరు తెలంగాణకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్‌లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు వెల్లడైంది. కాల్ సెంటర్‌లో వారి పాత్ర, ఎవరెవరిని సంప్రదించారు, ఎంత మొత్తంలో నగదు వసూలు చేశారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఫేక్ కాల్ సెంటర్ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు.