శ్రీశైలంలో భక్తుల రద్దీ.. మల్లన్న దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం

  • శ్రావణమాసం ఎఫెక్ట్.. శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

Srisailam Temple: శ్రావణమాసం నేపథ్యంలో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రస్తుతం స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరిచి, ఉదయం 4.30 గంటల నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభించారు.

శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం రోజుల్లో ఉదయం స్పర్శ దర్శనాలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, ఆలయ పరిసరాలు, ఇతర ఏర్పాట్లను సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Read More లాల్‌బజార్ బోనాల జాతరకు భక్తుల వెల్లువ.. నేడు రంగం కార్యక్రమం

శ్రీశైలం దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు ఆలయంలోని దర్శనం క్యూలైన్లను పరిశీలించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో నేరుగా మాట్లాడి దర్శనం, సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది అల్పాహారం అందిస్తున్నారు. తాగునీరు, ఇతర అవసరమైన సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. శ్రావణమాసం సందర్భంగా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అధిక సంఖ్యలో లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. రద్దీకి అనుగుణంగా దర్శనం, ప్రసాదాల పంపిణీ, క్యూలైన్ల నిర్వహణను సమన్వయం చేస్తూ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.

🕒 16 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/devotional/shravanamasam-effect-devotees-flocked-to-srisailam/article-21709

Tags: