అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నార్పల పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనం

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నార్పల పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనం

  • నార్పలలో పాత ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆరోపణలు

Narpala

Narpala news: అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనం నిర్లక్ష్యానికి గురై అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని జనత మహాసేన సంఘం కార్యదర్శి కుళ్లాయప్ప రాజు ఆరోపించారు. ఆసుపత్రిని సుల్తాన్‌పేటకు తరలించడంతో పాత భవనం ఖాళీగా ఉండిపోయిందని, దీంతో గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భవనం మందుబాబులు, జూదరులకు అడ్డాగా మారిందని, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Read More ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు

పాత ఆసుపత్రి భవనం తలుపులు, కిటికీలు పగలగొట్టడంతో పాటు లోపల ఉన్న విద్యుత్ వైరింగ్‌, ఫ్యాన్లను కూడా దొంగిలించి ధ్వంసం చేశారని కుళ్లాయప్ప రాజు తెలిపారు. అంతేకాకుండా ఆసుపత్రి ప్రహరీ గోడను సైతం కూల్చివేసి, ప్రభుత్వానికి చెందిన విలువైన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు కొందరు కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని, ఖాళీగా ఉన్న పాత ఆసుపత్రి స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించి నూతన నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags: