అనంతపురం మార్కెట్‌ యార్డులో రైతు ఆవేదన.. నాలుగు నెలలుగా డబ్బులు ఇవ్వలేదని ఆరోపణ

  • 10 టన్నుల చీనా కాయలు విక్రయించినా.. డబ్బులు చెల్లించలేదంటూ రైతు ఫిర్యాదు

Anantapur Farmers: అనంతపురం జిల్లా పుట్లూరు మండలం బాలాపురానికి చెందిన రైతు రామాంజనేయులు అనంతపురం మార్కెట్‌ యార్డులో తనకు డబ్బులు చెల్లించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చెందిన సుమారు 10 టన్నుల చీనా కాయలను మార్కెట్‌ యార్డులోని మూడో నంబర్‌ షాపులో విక్రయించగా.. నాలుగు నెలలు గడిచినా షాపు యాజమాన్యం డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.

ఈ విషయంపై మార్కెట్‌ యార్డు చైర్మన్‌ బల్లా పల్లవిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని రైతు తెలిపారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలుసుకున్న షాపు యజమాని.. పోలీసుల వద్దే డబ్బులు వసూలు చేసుకోవాలని చెప్పినట్లు రామాంజనేయులు ఆరోపించారు.

Read More అనంతపురం కరువుపై సీపీఐ పోరుబాట.. ఆగస్టు 17న కలెక్టరేట్ ముట్టడి

తాజాగా ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లగా.. మీడియా వారితోనే డబ్బులు వసూలు చేసుకోవాలని షాపు యాజమాన్యం చెప్పిందని రైతు వాపోయారు. నాలుగు నెలలుగా తన డబ్బుల కోసం ఎదురుచూస్తున్నానని, అధికారులు వెంటనే స్పందించి షాపు యాజమాన్యం నుంచి తనకు రావాల్సిన మొత్తాన్ని ఇప్పించి న్యాయం చేయాలని రామాంజనేయులు మీడియా ద్వారా కోరారు.

🕒 17 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/allegedly-the-farmers-grievance-in-the-anantapur-market-yard-has/article-21744

Tags: