విశాఖ ఎయిర్‌పోర్టులో ఔట్‌సోర్సింగ్ కార్మికుల ఆందోళన

  • కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.. ప్రభుత్వమే ఆదుకోవాలని కార్మికుల వేడుకోలు

Visakhapatnam Airport: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎయిర్‌పోర్టు మూసివేత కారణంగా తాము ఉపాధి కోల్పోయామని పోర్టర్లు, శానిటేషన్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20–30 ఏళ్లుగా ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న తమకు ప్రస్తుతం ఉపాధి లేక రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కంటతడి పెట్టుకున్నారు.

ఎయిర్‌పోర్టు మూసివేసిన తర్వాత తమను నియమించుకున్న కాంట్రాక్టర్లు కూడా చేతులెత్తేశారని కార్మికులు వాపోయారు. ఎన్నో ఏళ్లుగా ఇదే పనిని నమ్ముకుని జీవిస్తున్న తమ కుటుంబాల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందని తెలిపారు. ఎలాంటి ముందస్తు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించకుండానే తమను ఇబ్బందుల్లోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More న్యూ అంబేద్కర్‌ కాలనీలో మహిళల భద్రతపై ఆందోళన.. స్పందించాలని అధికారులకు విజ్ఞప్తి

ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని, ఎయిర్‌పోర్టులో పనిచేసిన ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.

🕒 17 Aug 2026 ✍️ Desk

విశాఖ ఎయిర్‌పోర్టులో ఔట్‌సోర్సింగ్ కార్మికుల ఆందోళన

Visakhapatnam Airport: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎయిర్‌పోర్టు మూసివేత కారణంగా తాము ఉపాధి కోల్పోయామని పోర్టర్లు, శానిటేషన్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20–30 ఏళ్లుగా ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న తమకు ప్రస్తుతం ఉపాధి లేక రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కంటతడి పెట్టుకున్నారు.

ఎయిర్‌పోర్టు మూసివేసిన తర్వాత తమను నియమించుకున్న కాంట్రాక్టర్లు కూడా చేతులెత్తేశారని కార్మికులు వాపోయారు. ఎన్నో ఏళ్లుగా ఇదే పనిని నమ్ముకుని జీవిస్తున్న తమ కుటుంబాల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందని తెలిపారు. ఎలాంటి ముందస్తు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించకుండానే తమను ఇబ్బందుల్లోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని, ఎయిర్‌పోర్టులో పనిచేసిన ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/concern-of-outsourcing-workers-at-visakhapatnam-airport/article-21746

Tags: