చండూర్ బస్సు షెల్టర్‌కు శంకుస్థాపన - మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి .
- ప్రజా అవసరాలే లక్ష్యంగా బీఆర్ఎస్
విశ్వంభర, చండూర్ ;-పట్టణ కేంద్రంలో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల సౌకర్యాలతో బస్సు షెల్టర్‌ను నిర్మించేందుకు బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ రాజకుమారి తల్లిదండ్రులు సరోజనమ్మ, సత్యనారాయణ జ్ఞాపకార్థం ఏర్పాటు చేయనున్న బస్సు షెల్టర్ నిర్మాణానికి మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ శ్రేణులు నిరంతరం ప్రజలకు అండగా నిలుస్తాయని తెలిపారు.ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సు షెల్టర్‌ను అన్ని సౌకర్యాలతో నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.