POCO M8x 5G వచ్చేస్తోంది.. ఆగస్టు 21న గ్రాండ్ లాంచ్
- స్నాప్‌డ్రాగన్ 4 Gen 5తో POCO M8x 5G.. అదిరిపోయే ఫీచర్లు
POCO M8x 5G phone: స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకునేలా POCO M8x 5G త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. POCO సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 21న మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఇందుకు సంబంధించిన టీజర్లను విడుదల చేశారు. పనితీరు, గేమింగ్, కూలింగ్ వంటి అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
POCO M8x 5Gలో భారత్‌లో తొలిసారిగా Snapdragon 4 Gen 5 ప్రాసెసర్ అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ చిప్‌సెట్ తదుపరి తరం AI సామర్థ్యాలు, వేగవంతమైన రెస్పాన్స్, స్మూత్ గేమింగ్ అనుభూతిని అందిస్తుందని తెలిపింది. 4nm ప్రాసెస్ టెక్నాలజీతో రూపొందిన ఈ ప్రాసెసర్ యాప్‌లను వేగంగా ఓపెన్ చేసేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ఫోన్ 650K+ AnTuTu స్కోర్ సాధిస్తుందని టీజర్‌లో పేర్కొంది.
మెమరీ విషయానికి వస్తే 12GB వరకు RAM అందుబాటులో ఉండనుంది. ఇందులో 6GB వర్చువల్ RAM కూడా ఉంటుంది. LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీతో భారీ యాప్‌లను కూడా వేగంగా రన్ చేయడం, మల్టీటాస్కింగ్‌లో మెరుగైన పనితీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.
ఫోన్‌లో ట్రిపుల్ కూలింగ్ టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 12,439 చదరపు మిల్లీమీటర్ల అల్ట్రా-లార్జ్ గ్రాఫైట్ కూలింగ్, 1,924 చదరపు మిల్లీమీటర్ల కాపర్ ఫాయిల్ లేయర్, 3.5W హై-ఎఫిషియెన్సీ థర్మల్ జెల్‌ను ఇందులో ఉపయోగించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇవి ఫోన్‌లో ఉత్పత్తి అయ్యే వేడిని సమర్థంగా బయటకు పంపించడంలో సహాయపడతాయని తెలిపింది.
అంతేకాకుండా 48 నెలల వరకు ల్యాగ్-ఫ్రీ వినియోగం కోసం ఫోన్‌ను ఆప్టిమైజ్ చేసినట్లు POCO పేర్కొంది. రిపేర్ సేవలు, సర్వీస్ సెంటర్లకు సంబంధించిన వివరాలను కూడా టీజర్లలో వెల్లడించింది. 92 శాతానికి పైగా రిపేర్‌లు అదే రోజులో పూర్తవుతాయని, దేశవ్యాప్తంగా 700కు పైగా సర్వీస్ సెంటర్లు, 600కు పైగా నగరాల్లో సేవలు, 19,000కు పైగా సర్వీస్ పిన్‌కోడ్‌లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది.