పిటిషన్లపై జాప్యం వద్దు.. అధికారులకు ఎస్పీ పి. జగదీష్ ఆదేశాలు

  • ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 106 వినతులు.. పిటిషన్లు స్వీకరించిన ఎస్పీ

Anantapur News: అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి. జగదీష్ IPS ప్రజల నుంచి స్వయంగా 106 పిటిషన్లు స్వీకరించారు. ప్రజలు అందించిన ప్రతి వినతిని బాధ్యతాయుతంగా విచారించి, ఎలాంటి జాప్యం లేకుండా చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ ద్వారా అందిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి, నిర్దేశిత గడువులోగా విచారణ పూర్తి చేయాలని సూచించారు.

పిటిషన్‌పై విచారణ పూర్తయిన అనంతరం సంబంధిత ఫిర్యాదుదారుడికి తప్పనిసరిగా సమాచారం అందించి, సమస్య పరిష్కారంపై వారి సంతృప్తిని నిర్ధారించుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు. సమస్యలు భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకుండా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పోలీస్ సిబ్బంది సేవాభావంతో పనిచేయాలని ఎస్పీ పి. జగదీష్ అన్నారు

Read More అనంతపురంలో MHPS నూతన కార్యవర్గం ఎంపిక: జిల్లా కన్వీనర్‌గా కొడవండ్ల నరేష్

. జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన బాధితులకు పిటిషన్ల నమోదులో సిబ్బంది సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. నాగభూషణం కూడా పిటిషనర్ల నుంచి వినతులు స్వీకరించారు. కాగా, పిటిషనర్లు, వారితో వచ్చిన ప్రజలకు ఇస్కాన్ సహకారంతో ఉచిత భోజన సదుపాయం కల్పించారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/sp-jagdish-orders-the-officers-not-to-delay-on-petitions/article-21581

Tags: