గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.1 కోటి స్వాహా
- బొగ్గు, నకిలీ బంగారు నాణేలతో నాటకం.. 11 మందిని మోసం చేసిన ముఠా
Hyderabad Crime: హైదరాబాద్‌లో గుప్త నిధుల పేరుతో ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు దోచుకున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మిస్తూ, ముందుగా గుంతలు తవ్వి అందులో బొగ్గు, నకిలీ బంగారు నాణేలను పాతిపెట్టేవారు. అనంతరం తాము చెప్పిన విధంగా ప్రత్యేక పూజలు చేస్తే ఆ బొగ్గు క్రమంగా బంగారంగా మారుతుందని నమ్మించి బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవారు. ఇలా మొత్తం 11 మందిని మోసం చేసి సుమారు రూ.1 కోటి వరకు స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ముఠాలో మహ్మద్ మునవ్వర్ (36), సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25), మహ్మద్ సల్మాన్ (29) ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ప్రధాన నిందితుడైన మునవ్వర్ గతంలో కారు మెకానిక్, పెయింటర్‌గా పనిచేసేవాడని, వచ్చే ఆదాయంతో జీవనం సాగించడం కష్టంగా ఉండటంతో స్నేహితులతో కలిసి గుప్త నిధుల పేరుతో మోసం చేయాలని పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి రెండు కార్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు, 25 డూప్లికేట్ గోల్డ్ కాయిన్స్‌తో పాటు పూజా సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధులు, బంగారం పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.